ఏ రాష్ట్రానికి, ప్రజలకు బడ్జెట్‌ ఉపయోగకరంగా లేదు: ప్రభాకరరెడ్డి

హైదరాబాద్: కేంద్ర బడ్జెట్‌పై రాష్ట్ర ప్రభుత్వాలు పెదవి విరుస్తున్నాయి. ఏ రాష్ట్రానికి, ప్రజలకు బడ్జెట్‌ ఉపయోగకరంగా లేదని ఎంపీ కొత్త ప్రభాకరరెడ్డి విమర్శించారు. ప్రతి ఇంటికి తాగునీరు బడ్జెట్‌లో పెట్టడం సంతోషకరమని, ఇప్పటికే తెలంగాణలో మిషన్ భగీరథ పేరుతో అమలు చేస్తున్నామని తెలిపారు. దాన్నే కేంద్రం పేరు మార్చి బడ్జెట్‌లో పెట్టుకున్నారన్నారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీలకు ఎలాంటి ప్రతిపాదనలు లేవని, మొత్తంగా బడ్జెట్ తెలంగాణకు మొండిచేయి చూపిందని కొత్త ప్రభాకరరెడ్డి విమర్శించారు. బడ్జెట్‌ ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా […]

Continue Reading

సీఎం జగన్‌పై తులసిరెడ్డి విమర్శలు

సీఎం జగన్‌పై కాంగ్రెస్ నేత తులసిరెడ్డి విమర్శలు గుప్పించారు. ఏపీ ప్రయోజనాలను కేసీఆర్‌కు తాకట్టుపెట్టే హక్కు జగన్‌కు లేదన్నారు. కేసీఆర్‌ మాయలో పడి జగన్‌ ఏపీకి జరుగుతున్న అన్యాయాన్ని పట్టించుకోవడంలేదని విమర్శించారు. జగన్‌ను కేసీఆర్‌ పావుగా వాడుకుంటున్నారని వ్యాఖ్యానించారు. కాళేశ్వరానికి వ్యతిరేకంగా జలదీక్ష చేసిన జగన్‌.. ఆ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఎలా వెళ్తారని ప్రశ్నించారు. కృష్ణా, గోదావరి నదులు ఏపీకి జీవనాడులని వివరించారు. కేసీఆర్‌ కృష్ణమ్మను బంధించారు, గోదావరిని బంధించేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. గోదావరిలో మిగులు, నికర […]

Continue Reading

కడప, అనంతపురం జిల్లాల్లో ఈ నెల 9న పర్యటిస్తా!: చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో 40 శాతం మంది ప్రజలు టీడీపీకి ఓటేశారనీ, వారందరిని రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలో ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలపై దాడులు పెరిగిపోవడం దారుణమని విమర్శించారు. టీడీపీ నేతలు, కార్యకర్తలు అసూయలు, అపోహలు వదిలేసి కలసికట్టుగా పనిచేయాలని సూచించారు. టీడీపీ శ్రేణుల్లో ధైర్యం నింపేందుకు ఈ నెల 9న కడప, అనంతపురం జిల్లాల్లో పర్యటిస్తానని చంద్రబాబు ప్రకటించారు. ఉండవల్లిలోని తన నివాసంతో ఈరోజు నిర్వహించిన […]

Continue Reading

వైఎస్ జగన్ గురించి మహరాష్ట్ర ఎంపీ నవనీత్ కౌర్ కామెంట్

తెలుగులో హీరోయిన్‌గా రాణించిన నవనీత్ కౌర్ ఇటీవల జరిగిన ఎన్నికల్లో మహారాష్ట్రలోని అమరావతి లోక్ సభ నియోజకవర్గం నుంచి స్వతంత్ర్య అభ్యర్థిగా గెలుపొందిన సంగతి తెలిసిందే. నవనీత్ కౌర్‌ మహారాష్ట్రకు చెందిన రాజకీయ నాయకుడు రవి రాణాను 2011లో ప్రేమ వివాహం చేసుకున్నారు. రవి రాణా బద్నేరా నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. భర్త ద్వారా రాజకీయ పాఠాలు నేర్చుకున్న నవనీత్ కౌర్…. గత ఐదేళ్లుగా రాజకీయాల్లో చుకురుగా ఉంటున్నారు. ఈ క్రమంలో ప్రజలకు […]

Continue Reading

పార్లమెంటుకు బస్తాల్లో చేరుకున్న బడ్జెట్ కాపీలు

మరికొన్ని నిమిషాల్లో పార్లమెంటులో బడ్జెట్ ప్రసంగం మొదలు కాబోతోంది. తొలిసారి ఓ మహిళా ఆర్థిక మంత్రి ప్రవేశపెడుతున్న పూర్తిస్థాయి బడ్జెట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. బడ్జెట్‌లో కూడికలు, తీసివేతలపై దేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఉదయం 11 గంటలకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతున్నారు. ఈ నేపథ్యంలో సభ్యలకు పంచేందుకు ముద్రించిన బడ్జెట్ కాపీలు పార్లమెంటుకు బస్తాల్లో చేరుకున్నాయి. ఆకుపచ్చ రంగు బస్తాల్లో కుట్టిన బడ్జెట్ ప్రతులను వ్యానులో పార్లమెంటు ప్రాంగణానికి తీసుకొచ్చారు. అక్కడి […]

Continue Reading

పార్లమెంటుకు చేరుకున్న నిర్మలా సీతారామన్‌

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంటుకు చేరుకున్నారు. నేడు పార్లమెంటులో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుండటంతో అందరి చూపూ ఆమెపైనే కేంద్రీకృతమైంది. కాషాయం రంగు బ్యాగు పట్టుకుని ఆమె పార్లమెంటులోకి అడుగుపెట్టారు.

Continue Reading