ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

రాష్ట్రంలో ఇంటర్మీడియెట్‌ ప్రథమ సంవత్సరం అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. గత నెల 7 నుంచి 14వ తేదీ వరకు ఇంటర్మీడియట్‌ సప్లిమెంటరీ పరీక్షలు జరిగాయని ఇంటర్‌ బోర్డు కార్యదర్శి ఎ అశోక్‌ చెప్పారు. ఇంటర్‌ ప్రథమ సంవత్సరం సప్లిమెంటరీ పరీక్షలకు 3,00,607 మంది హాజరయ్యారని అన్నారు. వారిలో 1,93,333 (64.31 శాతం) మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారని చెప్పారు. ఇంప్రూy ్‌మెంట్‌ కోసం 1,51,002 మంది రాయగా, వారు ఉత్తీర్ణత పొందారని అన్నారు. ఇంటర్‌ […]

Continue Reading

జిల్లా ఆసుపత్రుల్లో క్యాన్సర్ నివారణకు ఏర్పాట్లు..ఆరోగ్య సంస్కరణల నిపుణుల కమిటీ ఛైర్ పర్సన్ సుజాతారావు

రాష్ట్రంలో వ్యాధుల నియంత్రణకు సంబంధించి కార్యాచారణ ప్రణాళికను సిద్ధం చేయాలని ఆరోగ్య సంస్కరణలపై ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ ఛైర్ పర్సన్, రిటైర్డ్ ఐఎఎస్ అధికారి సుజాతారావు సూచించారు. వ్యాధుల నియంత్రణపై ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన వర్క్‌షాప్‌లో ఆమె పలు సూచనలు చేశారు. అంటు రోగాలు, ఇతర రోగాల విషయంలో ప్రస్తుతం రాష్ట్రంలో అమలులో ఉన్న పలు పథకాలు, కార్యక్రమాలపై ఆమె లోతుగా చర్చించారు. శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో కిడ్నీ రోగులు ఎదుర్కొంటున్న […]

Continue Reading

మూడో రోజుకు చేరిన 108 సమ్మె

ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా 108 సిబ్బంది చేపట్టిన సమ్మె గురువారానికి మూడో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా విజయవాడ గాంధీనగర్ లోని సిఐటియు అనుబంధమైన 108 కార్మికులు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకుడు బల్లి కిరణ్ కుమార్ నేతృత్వంలో గాంధీనగర్లోని వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి వినతి పత్రం ఇచ్చి తమ సమస్యలు పరిష్కరించాలని వేడుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో 439 అంబులెన్సులు పనిచేస్తున్నాయని, 2300 మంది కార్మికులు పనిచేస్తున్నారని, గత […]

Continue Reading

నాకు రోజూ ఇడ్లీ పెట్టారు.. బైకుపై తీసుకొచ్చి దింపేశారు… జషిత్ కిడ్నాప్ కథకు తెర

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన నాలుగేళ్ళ బాలుడు జషిత్ కథ సుఖాంతమైంది. పోలీసుల ముమ్మర వేటతో పాటు.. సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియాలో విపరీతమైన ప్రచారం చేయడంతో దిక్కుతోచని కిడ్నాపర్లు జషిత్‌ను తూర్పుగోదావరి జిల్లా కుతుకులూరు రోడ్డులో గురువారం తెల్లవారుజామున వదిలివెళ్లారు. తన కిడ్నాప్ గురించి జషిత్ పోలీసులకు కొంత సమాచారం అందించారు. ‘నేను నిన్న ఏదో ఊరు దగ్గర ఉన్నాను. నన్ను ఎవరో కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. ఒక అబ్బాయి వాళ్ల ఇంట్లో వదిలేశారు. […]

Continue Reading

విశాఖ ఇక.. వెలుగు బాట..!

ఇన్‌చార్జి మంత్రిగా మోపిదేవి వెంకటరమణ నగరం, జిల్లాపై ఆయనకు పూర్తి అవగాహన ఇప్పటికే పాలనను పరుగులు పెట్టిస్తున్న మంత్రి అవంతి ఆర్థిక రాజధానికి మోపిదేవి సారథ్యంతో మేలు మోముపై చెరగని చిరునవ్వు.. తెలియని వారికి సైతం ఆత్మీయ పలకరింపు.. పాలనపై పట్టు.. ప్రజా సమస్యలపై అపారమైన అవగాహన.. ఇవన్నీ కలగలిసిన నేత మోపిదేవి వెంకటరమణ. రాష్ట్ర పశుసంవర్థక, మార్కెటింగ్, మత్స్యశాఖల మంత్రిగా ఉన్న ఆయన్ను విశాఖ జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా నియమించడం ద్వారా ముఖ్యమంత్రి వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డి మోపిదేవిపై […]

Continue Reading

300కిలోల గంజాయి స్వాధీనం

రెండు కార్లలో తరలిస్తున్న 300 కిలోల గంజాయిని గుంటూరు జిల్లా యడ్లపాడు మండలం బోయపాలెం వద్ద పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విజయవాడ నుంచి గుంటూరు వైపు కార్లలో గంజాయి తరలిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. కాజా టోల్‌గేట్‌ వద్ద ఒక కారు స్వాధీనం చేసుకోగా.. మరో కారు ఆపకుండా వెళ్లడంతో వారిని వెంబడించారు. చిలకలూరిపేట మార్గంలో బోయపాలెం వద్దకు వచ్చేసరికి నిందితుల కారు పంచర్‌ కావడంతో, దానిని అక్కడే వదిలి దుండగులు పరారయ్యారు. 300 కేజీల […]

Continue Reading

ఇసుకదొంగల మాయాజాలం

కృష్ణాతీరంలో ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. ప్రకృతి సంపదను ఇష్టారాజ్యంగా తవ్వేస్తున్నారు. ఓవైపు ప్రభుత్వం ఇసుక మాఫియాపై ఉక్కుపాదం మోపుతామని చెబుతుంటే.. మరోవైపు దర్జాగా నదీగర్భాన్ని ప్రొక్లెయిన్లతో తవ్వేస్తున్నారు అక్రమార్కులు. ప్రభుత్వ పనుల పేరుచెప్పి టిప్పర్లకొద్ది ఇసుకను ప్రైవేట్ పనులకు తరలిస్తున్నారు. కృష్ణా జిల్లాలో ఇసుకదొంగల మాయాజాలంపై టీవీ5 ఎక్స్ క్లూజివ్ రిపోర్ట్.. ఏపీలో ఇసుక మాఫియా ఆగడాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. తవ్వుకున్నోడికి తవ్వుకున్నంత అన్నట్లు తయారైంది పరిస్థితి. రాత్రి పగలు అనే తేడా లేకుండా దర్జాగా […]

Continue Reading

చిల్లర వ్యాపారులకు పెన్షన్ స్కీమ్

హైదరాబాద్‌: సుమారు మూడు కోట్ల చిల్లర వ్యాపారులకు పెన్షన్ పథకాన్ని అమలు చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల తెలిపారు. ఇవాళ లోక్‌సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వార్షిక టర్న్ఓవర్ 1.5 కోట్ల కన్నా తక్కువ ఆదాయం ఉన్న రిటేల్ ట్రేడర్లకు పెన్షన్ బెనిఫిట్ కల్పించనున్నట్లు ఆమె చెప్పారు. ప్రధానమంత్రి కరమ్ యోగి మాన్ ధాన్ స్కీమ్ కింద ఇది వర్తిస్తుందన్నారు. జీఎస్టీ కింద రిజిస్టర్ చేసుకున్న మధ్యశ్రేణి సంస్థలకు 2 శాతం వడ్డీతో […]

Continue Reading

టిటిడి చైర్మన్‌ గా తొలిసారి శ్రీవారి సేవలో వైవి.సుబ్బారెడ్డి

తిరుపతి : వైవి.సుబ్బారెడ్డి మొదటిసారి టిటిడి చైర్మన్‌ హోదాలో శ్రీవారి అభిషేక సేవలో శుక్రవారం పాల్గన్నారు. అనంతరం వైవి.సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. శ్రీవారి భక్తులకు మెరుగైన సేవలు అందిస్తామన్నారు. తిరుమలలో కాలుష్య నివారణకు బ్యాటరీ వాహనాలను తీసుకోస్తామని తెలిపారు. డంపింగ్‌ యార్డ్‌ లో ఉన్న వ్యర్థాలను తొలగిస్తామని చెప్పారు. పూర్తి పాలకమండలి రాగానే వీటిపై నిర్ణయం తీసుకుంటామన్నారు. సిఎం వైఎస్‌.జగన్‌ మోహన్‌ రెడ్డి ఆదేశాలతో తిరుమల భక్తులకు నీటి కష్టాలు లేకుండా చేస్తామని వైవి సుబ్బారెడ్డి పేర్కొన్నారు.

Continue Reading