బెదిరించడం.. దోచుకెళ్లడం

ఇద్దరు దొంగల అరెస్ట్‌ రూ.5 లక్షల సొత్తు స్వాధీనం బెయిల్‌పై రావడం.. మళ్లీ నేరాలు చేయడం  నెల్లూరు(క్రైమ్‌): వారిద్దరూ దొంగలు.. ఒంటరిగా వెళ్లేవారిని బెదిరించి నగలు దోచుకెళ్లడం.. చైన్‌స్నాచింగ్‌లు చేయడంలో సిద్ధహస్తులు. వారి కదలికలపై నిఘా ఉంచిన నెల్లూరులోని వేదాయపాళెం పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి రూ.5 లక్షలు విలువచేసే సొత్తును స్వాధీనం చేసుకున్నారు. నెల్లూరు నగర డీఎస్పీ జె.శ్రీనివాసులురెడ్డి గురువారం నగరంలోని తన కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలను వెల్ల డించారు. […]

Continue Reading

యువతి వేధిస్తోందని…

రాంగోపాల్‌పేట్‌: తనపై ఓ యువతి, ఆమె కుటుంబ సభ్యుల తప్పుడు ఫిర్యాదులు చేస్తున్నారనే కారణంతో ఓ యువకుడు ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటన గోపాలపురం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన మేరకు.. రెజిమెంటల్‌బజార్‌కు చెందిన రమేష్, శోభారాణిల కుమారుడు నందరాజు ఇలియాస నితిన్‌ ముదిరాజ్‌ (26) కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. కొద్ది రోజుల క్రితం అతడి ఇంటి సమీపంలో ఉండే ఓ యువతి నితిన్‌ తనను వేధిస్తున్నాడని ఒక […]

Continue Reading

ఎవరు?..ఎందుకు?

ఏమిటి ? – యువతి కిడ్నాప్‌ ఎప్పుడు ? – మంగళవారం (23న) ఎక్కడ? – హయత్‌నగర్‌లో.. ఎలా ? – మాటల్లో దించి కారులో.. ఎవరు ? – గుర్తుతెలియని యువకుడు ఎందుకు ? – తెలియదు యువతి కిడ్నాప్‌.. అంతా పక్కా ప్లాన్‌ ప్రకారమే జరిగింది. నిందితుడుతాననుకున్నది అనుకున్నట్లే చేశాడు.. యువతి తండ్రి నిర్వహించే టీదుకాణం వద్దకు కారులో రావడం.. అతనిని మాటల్లో పెట్టడం.. అతను నమ్మి కుమారుడు,కుమార్తెను తీసుకొని నగరంలో నిందితుడి కారులో […]

Continue Reading

ఎస్‌ఐ బైక్‌నే కొట్టేశార్రా బాబూ!

చిత్తూరు అర్బన్‌ : చోరీలు జరిగితే ప్రజలు వెళ్లి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడం మామూలు విష యం. కానీ పోలీసు అధికారే తన బైక్‌ చోరీకి గురైందంటూ పోలీసులను ఆశ్రయించడం కాస్త విభిన్నం. చిత్తూరు స్పెషల్‌ బ్రాంచ్‌లో పనిచేస్తున్న ఎస్‌ఐ రఘుకు ఇదే అనుభవం ఎదురైంది. బుధవారం రాత్రి తన పల్సర్‌ బైక్‌ను ఉషానగర్‌ కాలనీలో నివాసముంటున్న అపార్టుమెంటులో ఉంచి గదిలో పడుకున్నారు. గురువారం ఉదయం లేచి చూసేసరికి బైక్‌ కనిపించలేదు. దీంతో ఆయన క్రైమ్‌ పోలీసులకు […]

Continue Reading

దళిత సేవలో నాలుగో సింహం

అర్బన్‌ జిల్లాలో 19 వాటర్‌ ట్యాంక్‌ల ఏర్పాటు పాఠశాల్లో మౌలిక వసతుల కల్పనకు పోలీసు నిధి దళిత గ్రామాల్లో 20 వేల మొక్కల పెంపకం క్రీడల్లోనూ ఫ్రెండ్లీ ప్రోత్సాహం ప్రశంసలు అందుకుంటున్న అర్బన్‌ ఎస్పీ అన్బురాజన్‌ వృత్తిలో ఒత్తిడి ఉన్నా సేవభావంలో ఆదర్శంగా నిలిచే వారు అరుదుగా ఉంటారు. సరిగ్గా అలాంటి ‘రియల్‌ పోలీస్‌’ అర్బన్‌ ఎస్పీ అన్బురాజన్‌. దళితుల అభ్యున్నతే లక్ష్యంగా ఆపన్న హస్తం అందిస్తున్నారు. పలు సేవా కార్యక్రమాల్లో ముందుంటున్నారు. 19 దళిత గ్రామాల్లో […]

Continue Reading