యువతి వేధిస్తోందని…

Crime

రాంగోపాల్‌పేట్‌: తనపై ఓ యువతి, ఆమె కుటుంబ సభ్యుల తప్పుడు ఫిర్యాదులు చేస్తున్నారనే కారణంతో ఓ యువకుడు ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటన గోపాలపురం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన మేరకు.. రెజిమెంటల్‌బజార్‌కు చెందిన రమేష్, శోభారాణిల కుమారుడు నందరాజు ఇలియాస నితిన్‌ ముదిరాజ్‌ (26) కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. కొద్ది రోజుల క్రితం అతడి ఇంటి సమీపంలో ఉండే ఓ యువతి నితిన్‌ తనను వేధిస్తున్నాడని ఒక మారు, తన తమ్ముడిని కొట్టాడని ఒక మారు పోలీసులకు తప్పుడు ఫిర్యాదులు చేసింది. అలాగే ఆ యువతి కుటుంబ సభ్యులు తరచూ చుట్టు పక్కల ఉండే వారిపై ఇలాగే ఫిర్యాదులు చేయడంతో పలువురిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. మంగళవారం రాత్రి ఇలాగే ఆ యువతి కుటుంబ సభ్యులు పక్కన ఉండే వారిని వీడియో తీస్తుండంతో స్థానికులతో గొడవ జరిగింది. ఈ కేసులో నితిన్‌ కు సంబంధం లేకున్నా అతనిపై పోలీసులకు ఆ కుటుంబ స భ్యులు ఫిర్యాదు చేశారు. మానసికంగా కుంగిపోయిన నితిన్‌ బుధవారం రాత్రి 1.30గంటల సమయంలో ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకున్నాడు. కుటుబ సభ్యులు మంట లను ఆర్పి గాంధీ ఆస్పత్రికి తరలించారు. 70 శాతం కాలిన గాయాలతో ఆ యువకుడు గాంధీ ఆస్పత్రిలో చికితస పొందుతున్నాడు. గోపాలపురం పోలీసులు కేసు నమోదు చేసుకుని ధర్యాప్తు చేపట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *