ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

News

రాష్ట్రంలో ఇంటర్మీడియెట్‌ ప్రథమ సంవత్సరం అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. గత నెల 7 నుంచి 14వ తేదీ వరకు ఇంటర్మీడియట్‌ సప్లిమెంటరీ పరీక్షలు జరిగాయని ఇంటర్‌ బోర్డు కార్యదర్శి ఎ అశోక్‌ చెప్పారు. ఇంటర్‌ ప్రథమ సంవత్సరం సప్లిమెంటరీ పరీక్షలకు 3,00,607 మంది హాజరయ్యారని అన్నారు. వారిలో 1,93,333 (64.31 శాతం) మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారని చెప్పారు. ఇంప్రూy ్‌మెంట్‌ కోసం 1,51,002 మంది రాయగా, వారు ఉత్తీర్ణత పొందారని అన్నారు. ఇంటర్‌ ప్రథమ సంవత్సరంలో ఫెయిలైన విద్యార్థులు 1,49,605 మంది పరీక్ష లకు హాజరుకాగా, 42,331 (28.29 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారని వివరించారు. జనరల్‌ కేటగిరీలో బాలికలు 1,38,166 మంది పరీక్షలు రాయగా, 96,883 (70.1 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారని చెప్పారు. బాలురు 1,47,932 మంది పరీక్షలకు హాజరుకాగా, 89,577 (60.5 శాతం) మంది ఉత్తీర్ణత పొందారని అన్నారు. బాలురు కంటే బాలికలు 9.6 శాతం అధికంగా ఉత్తీర్ణులయ్యారని వివరించారు. జనరల్‌ కేటగిరీలో 79 శాతం ఉత్తీర్ణతతో మేడ్చల్‌ ప్రథమ స్థానంలో నిలవగా, 33 శాతం ఉత్తీర్ణత సాధించి మెదక్‌ జిల్లా చివరిస్థానంలో ఉందని అన్నారు. గ్లోబరీనాతోపాటు డాటాటెక్‌ మెథడెక్స్‌, మ్యాగటెక్‌ ఇన్ఫో సంస్థలు ఈ ఫలితాలను ప్రాసెసింగ్‌ చేశాయని చెప్పారు. మూడు సంస్థల ఫలితాలను జేఎన్టీయూ హైదరాబాద్‌ పర్యవేక్షించిందని అన్నారు. రీకౌంటింగ్‌, రీవెరిఫికేషన్‌ కోసం ఈనెల 31వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. రీకౌంటింగ్‌కు సబ్జెక్టుకు రూ.100, రీవెరిఫికేషన్‌కు సబ్జెక్టుకు రూ.600 చొప్పున ఫీజు చెల్లించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఇంటర్‌ పరీక్షల నియంత్రణ అధికారి ఖాలిక్‌, జాయింట్‌ డైరెక్టర్‌ భీంసింగ్‌, మాజీ సీవోఈ సుశీల్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *