Oh! Baby సినిమా రివ్యూ అండ్ రేటింగ్

Entertainment

అభిమన్యుడు, రంగస్థలం, సూపర్ డీలక్స్, యూటర్న్ లాంటి సినిమాలు ఆమెను మరో లెవెల్‌కు తీసుకెళ్లాయి. తాజాగా ఫెర్ఫార్మెన్స్‌కు స్కోప్ ఉన్న పాత్రతో ఓ బేబీగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ సినిమా జూలై 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సమంత కెరీర్‌లో మరో హిట్ పడిందా? సమంత స్టార్‌డమ్‌కు ఈ సినిమా ఏ మేరకు ఉపయోగపడింది.. నందినీరెడ్డికి ఖాతాలో మరో హిట్ చేరిందా? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం కావాలంటే సినిమాను సమీక్షించాల్సిందే.

ఓ బేబీ సినిమా కథ
ఓ బేబీ మూవీ కథ

బేబీ (లక్ష్మీ) కల్మషం లేని వృద్ధురాలు. విధి ఆడిన నాటకంలో బలైన ఓ మధ్య తరగతి యువతిగా ఎన్నో ఆటుపోట్లను తట్టుకొని నిలబడుతుంది. భర్త చనిపోతూ చేతిలో పెట్టిన కుమారుడు (రావు రమేష్) ఆమెకు సర్వస్వం. అలాంటి కొడుకుకు తల్లి భారంగా మారుతుంది. తప్పని పరిస్థితిలో ఇంటిని వీడిపోవాల్సి వస్తుంది. అయితే అనూహ్యమైన పరిస్థితిలో 24 ఏళ్ల యువతి స్వాతి (సమంత)గా మారిపోతుంది. చిట్టి (రాజేంద్ర ప్రసాద్)తో కలిసి జీవితాన్ని ఆస్వాదించే సమయంలో ఓ సమస్య ఎదురు పడుతుంది.

ఓ బేబీలో ట్విస్టులు
ఓ బేబీలో మలుపులు

అత్యంత ఇష్టంగా ప్రేమించిన కుమారుడికి బేబీ ఎందుకు దూరమైంది? ఏ పరిస్థితుల్లో బేబీ 24 ఏళ్ల యువతిగా మారింది? 70 ఏళ్ల నుంచి పడుచు అమ్మాయిలా మారిన తర్వాత ఎదురైన సమస్యలు ఏమిటి? ఆ తర్వాత స్నేహితుడు (రాజేంద్ర ప్రసాద్)తో కెమిస్ట్రీ తెరపైన ఎలా పడింది? నాగశౌర్య క్యారెక్టర్ ఏంటి? దూరమైన తల్లి కోసం శేఖర్ ఎలాంటి ఆవేదనకు గురయ్యాడు. శేఖర్ కుటుంబం బేబీ విషయంలో ఎలా రియలైజ్ అయిందనే ప్రశ్నలకు సమాధానం ఓ బేబీ కథ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *