రవితేజ కెరీర్ ఎటు పోతుంది

Entertainment

టాలీవుడ్లో స్వయంకృషితో ఎదిగిన అతి కొద్ది మంది హీరోల్లో రవితేజ ఒకరు. కెరీర్ మొదట్లో చిన్న పాత్రల్లో నటించినా తక్కువ సమయంలోనే హీరోగా ఎదిగాడు రవితేజ. తన కామెడీతో వరుస విజయాలు సాధించాడు. ఒకానొక సమయంలో టాలీవుడ్లో స్టార్ హీరోలతో సమానంగా పారితోషికం కూడా అందుకున్నాడు రవితేజ. కానీ ప్రస్తుతం రవితేజ ఫ్లాపుల్లో ఉన్నాడు. రవితేజకు ఒక సినిమాను మించి మరో సినిమా ఫ్లాప్ అవుతూనే ఉంది,

రవితేజ సినిమాలకు ఒకప్పుడు సినిమా ఫ్లాప్ ఐనా కలెక్షన్లు వచ్చేవి. కానీ ప్రస్తుతం పరిస్థితి అలా లేదు. మిరపకాయ్ సినిమా తరువాత దొంగలముఠా, వీర , నిప్పు, దరువు, దేవుడు చేసిన మనుషులు, సారొచ్చారు ఇలా వరుసగా ఆరు ఫ్లాపులు ఇచ్చాడు రవితేజ. బలుపు సినిమాతో హిట్టు కొట్టినా ఆ హిట్ మేనియా కొనసాగించలేకపోయాడు. 2017లో వచ్చిన రాజా ది గ్రేట్ మాత్రమే రవితేజ హిట్టు కొట్టిన చివరి సినిమా.

రాజా ది గ్రేట్ సినిమా తరువాత టచ్ చేసి చూడు, నేల టికెట్, అమర్ అక్బర్ ఆంటోని సినిమాలు డిజాస్టర్లుగా మిగిలాయి. రవితేజ చేతిలో ప్రస్తుతం డిస్కోరాజా అనే ఒకే ఒక్క సినిమా ఉంది. ఈ సినిమా కూడా మధ్యలో ఆగిపోయినట్లు వార్తలు వచ్చినా అవి నిజం కాదని తేలింది. ఈ సినిమాతోనైనా రవితేజ హిట్టు కొట్టకపోతే రవితేజా కెరీర్ ప్రమాదంలో పడే అవకాశం ఉంది. మరి డిస్కో రాజాతోనైనా రవితేజ హిట్టు కొడతాడో లేదో చూడాలి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *