మరో ఫినిషర్‌ని సిద్దం చేసి వెళ్ళు: మలింగా

Sports

ధోని ప్రపంచకప్ మెగా టోర్నీ తరువాత రిటైర్మెంట్ తీసుకుంటాడు అని వస్తున్న వార్తలపై తాజాగా శ్రీలంక బౌలర్ లసిత్ మలింగా స్పందించాడు. ఈ సందర్భంగా మలింగా ఓ మీడియాతో మాట్లాడుతూ…’ధోనీ కనీసం ఏడాది లేదా రెండేళ్లపాటు క్రికెట్‌లో కొనసాగాలి. అదే సమయంలో.. టీమ్‌లో ఒక ఫినిషర్‌ని కూడా అతను సిద్ధం చేయాలి. ఇప్పటికీ క్రికెట్ ప్రపంచంలో ధోనీనే అత్యుత్తమ ఫినిషర్. అందుకే.. టీమ్‌లో అతడి స్థానాన్ని భర్తీ చేయడం చాలా కష్టం. యువ ఆటగాళ్లు ధోనీ నుంచి ఆ ఫినిషింగ్ టెక్నిక్స్ నేర్చుకోవాలి’ అని సూచించాడు. ప్రపంచకప్‌లో అఫ్గానిస్థాన్, ఇంగ్లాండ్‌పై నెమ్మదిగా ఆడిన ధోనీపై మాజీ క్రికెటర్లు, అభిమానులు మండిపడ్డారు. అతని బ్యాటింగ్‌లో మునుపటి దూకుడు కనిపించకపోవడంతో ఇక రిటైర్మెంట్ ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. అయినప్పటికీ.. ధోనీ సైలెంట్‌గా తన బ్యాటింగ్‌ని కొనసాగిస్తున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *