ఫుట్‌బాల్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన అర్జెన్‌ రాబెన్‌

Sports

హైదరాబాద్: నెదర్లాండ్స్ మాజీ దిగ్గజం అర్జెన్‌ రాబెన్‌ ఫుట్‌బాల్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 2010 ఫుట్‌బాల్‌ ప్రపంచక్‌పలో అద్భుత ప్రదర్శనతో అర్జెన్ రాబెన్‌ జట్టును ఫైనల్‌కు చేర్చడంలో కీలకపాత్ర పోషించాడు. అయితే 2018లో జరిగిన వరల్డ్‌కప్‌కు నెదర్లాండ్స్ క్వాలిఫై కాకపోవడంతో 2017లోనే అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు వీడ్కోలు పలికాడు.

నెదర్లాండ్స్ జాతీయ జట్టు తరుపున మొత్తం 96 మ్యాచ్‌లు ఆడిన రాబెన్‌ 37 గోల్స్‌ సాధించాడు. 19 ఏళ్ల క్రితం డచ్‌కు చెందిన ఎఫ్‌సి గ్రోనిన్‌జెన్‌తో పుట్‌బాల్ అరంగేట్రం చేసిన రాబెన్ రియల్ మాడ్రిడ్, పీఎస్‌వి లాంటి క్లబ్స్ తరుపున కూడా ఆడాడు. తాను ఆడిన ప్రతి క్లబ్ తరుపున ట్రోఫీలు గెలిచాడు.

ఇందులో ఎనిమిది బుండెల్సిగా టైటిళ్లతో పాటు 2005, 2006లో ప్రీమియర్ లీగ్ టైటిళ్లను కూడా గెలిచాడు. చెల్సియా, రియల్‌ మాడ్రిడ్‌ తరఫున అద్భుతంగా రాణించిన రాబెన్ గత పదేళ్లుగా బేయర్న్‌ మ్యూనిచ్‌ క్లబ్ తరఫున ఆడుతున్నాడు. జూన్ 30తో అతడి కాంట్రాక్ట్‌ ముగియడంతో ఫుట్‌బాల్‌కు వీడ్కోలు పలికాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *