ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించగలనా ?

Entertainment

వివాహం తర్వాత విభిన్నమైన సినిమాలు అంగీకరిస్తూ మంచి నటిగా గుర్తింపు సంపాదించుకుంటోంది అక్కినేని వారి కోడలు సమంత. ఆమె తాజాగా నటించిన చిత్రం `ఓ బేబీ`. ‘యూటర్న్‌’ తర్వాత సమంత నటించిన లేడీ ఓరియెంటెడ్ చిత్రం ఇదే. ఈ సినిమా గురించి సమంత తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘ఓ బేబి’ ” నా సామర్థ్యానికి పరీక్షలాంటిది. నా కోసం ఎంత మంది థియేటర్లకు వస్తారో చూడాలి. కేవలం నా కోసమే జనాలు థియేటర్లకు వస్తారని నేను అనుకోను. మనకు ఇంకా అలాంటి పరిస్థితి రాలేదు. మహేష్, చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, ప్రభాస్ లాంటి స్టార్లు మాత్రమే జనాల్ని థియేటర్లకు రప్పించగలరు. నేను ఎంతవరకూ పుల్ చేయగలను అన్నది చెప్పలేను. జనాలు థియేటర్ల వరకూ వస్తే ‘ఓ బేబీ’ సినిమా కచ్చితంగా నచ్చుతుంది. వస్తారా? అనేదే అనుమానం. థ్రిల్లర్ సినిమాలను జనాలు ఇష్టపడతారు.

అలాంటి కథాంశానికి లేడీ ఓరియెంటెడ్ కలిపి చేస్తే బాగుంటుందని ‘యూటర్న్’ చేశాం. రివ్యూలు బాగా వచ్చాయి. కానీ, జనాలు థియేటర్లకు రాలేదు. ఈ సారి మరింత మంచి కథతో ‘ఓ బేబీ’ చేశా. ఇది కూడా వర్కవుట్ కాకపోతే తర్వాత ఏమి చేయాలో నాకైతే తెలియద`ని సమంత చెప్పింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *