పార్లమెంటుకు బస్తాల్లో చేరుకున్న బడ్జెట్ కాపీలు

Politics

మరికొన్ని నిమిషాల్లో పార్లమెంటులో బడ్జెట్ ప్రసంగం మొదలు కాబోతోంది. తొలిసారి ఓ మహిళా ఆర్థిక మంత్రి ప్రవేశపెడుతున్న పూర్తిస్థాయి బడ్జెట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. బడ్జెట్‌లో కూడికలు, తీసివేతలపై దేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఉదయం 11 గంటలకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతున్నారు. ఈ నేపథ్యంలో సభ్యలకు పంచేందుకు ముద్రించిన బడ్జెట్ కాపీలు పార్లమెంటుకు బస్తాల్లో చేరుకున్నాయి. ఆకుపచ్చ రంగు బస్తాల్లో కుట్టిన బడ్జెట్ ప్రతులను వ్యానులో పార్లమెంటు ప్రాంగణానికి తీసుకొచ్చారు. అక్కడి నుంచి వాటిని కూలీలు భవనంలోకి తీసుకెళ్లారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *