ఏ రాష్ట్రానికి, ప్రజలకు బడ్జెట్‌ ఉపయోగకరంగా లేదు: ప్రభాకరరెడ్డి

Politics

హైదరాబాద్: కేంద్ర బడ్జెట్‌పై రాష్ట్ర ప్రభుత్వాలు పెదవి విరుస్తున్నాయి. ఏ రాష్ట్రానికి, ప్రజలకు బడ్జెట్‌ ఉపయోగకరంగా లేదని ఎంపీ కొత్త ప్రభాకరరెడ్డి విమర్శించారు. ప్రతి ఇంటికి తాగునీరు బడ్జెట్‌లో పెట్టడం సంతోషకరమని, ఇప్పటికే తెలంగాణలో మిషన్ భగీరథ పేరుతో అమలు చేస్తున్నామని తెలిపారు. దాన్నే కేంద్రం పేరు మార్చి బడ్జెట్‌లో పెట్టుకున్నారన్నారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీలకు ఎలాంటి ప్రతిపాదనలు లేవని, మొత్తంగా బడ్జెట్ తెలంగాణకు మొండిచేయి చూపిందని కొత్త ప్రభాకరరెడ్డి విమర్శించారు.

బడ్జెట్‌ ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా ఉందని ఎంపీ నామా నాగేశ్వరరావు ఆరోపించారు. మిషన్‌ భగీరథ స్ఫూర్తితో హర్‌ ఘర్‌ జల్‌ పథకం పెట్టారని విమర్శించారు. మిషన్‌ భగీరథకు ఆర్థికసాయం చేస్తే బాగుండేదని, బంగారంపై సుంకం పెంపుతో సామాన్యులకు ఇబ్బందేనని నామా చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *