Latest News
హోమ్ >>

పనస పండు ఆరోగ్య రహస్యాలు

Updated: June 12, 2016

ప్రపంచంలోనే అతి పెద్ద పండును ఇచ్చే చెట్టు పనస. నస మల్బరీ కుటుంబానికి చెందిన చెట్టు. తూర్పు ఆసియా దీని జన్మస్థలం. ప్రపంచంలోనే అతి పెద్ద పండును ఇచ్చే చెట్టు ఇదే. దాదాపు ఒక్కోటి 36 కేజీలుంటుంది. 90 సెంటీమీటర్ల పొడవు, 50 సెంటీమీటర్ల వ్యాసం కలిగి ఉంటాయి. సువాసనలు వెదజల్లుతూ నోరూరించే పనసపండు అంటే అందరికీ ఇష్టమే.పనసపండులో శరీరారోగ్యాన్ని పెంపొందింపచేసే పలు పోషక పదార్ధాలు పుష్కలంగా వుంటాయి.
ఎక్కువగా విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్
పనసలో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల మంచి ఆరోగ్యాన్నిస్తుంది. ఈ పండులో ‘ఏ',‘సి' విటమిన్లు స్వల్పంగా ఉంటాయి. పొటాషియం, మెగ్నీషియం మెండుగా ఉండా ఆరోగ్యానికి బాగా సహాయపడుతాయి. చెట్టున పండిన కాయను, కోసిన వెంటనే తింటే, అదంత రుచికరంగా ఉండదు. తయారైన కాయను కోసి, నిలువ ఉంచితే, ఆ పనస తొనలుచాలా తియ్యగా ఉంటాయి. అవి దేహానికి పుష్టినిస్తాయి. నాడిశక్తిని పెంచుతాయి.

హైపర్ టెన్షన్ తగ్గించడంలో
దీనిలో ఉండే ఫైటో న్యూట్రియంట్స్ క్యాన్సర్ నుంచేకాక హైపర్ టెన్షన్ తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే ఆస్తమాతో బాధపడేవారికి పనస ఎంతో మేలు చేస్తుంది. పనస
వేరును బాగా ఉడికించి దాని నుంచి వచ్చే రసం తీసుకుంటే ఆస్తమా అదుపులో ఉంటుంది. అలాగే పనస వేరు చర్మ వ్యాధులలోనూ చక్కగా పని చేస్తుంది.జ్వరం, డయారియా రుగ్మతలకుపనస తొనలు జ్వరం, డయారియా రుగ్మతలకు ఔషధంగా పనిచేస్తుందని విశ్వసిస్తారు. అంతేకాదు చర్మ ఆరోగ్యాన్ని కలిగించే కణాలు త్వరగా నశించకుండా పనస కాపాడుతుంది. అలాగేఇందులో వయసు మళ్లే లక్షణాలు తగ్గించే గుణాలు ఉన్నాయి. ఆరోగ్యానికి పనస ఎంతో మేలు చేస్తుంది.

అధికబరువును తగ్గించడంలో
అధిక బరువును, టెన్షన్‌ను త‌గ్గించ‌డంలో ప‌న‌స బాగా ప‌నిచేస్తుంది. యాంటీ ఏజింగ్ గుణాలు ప‌న‌స పండ్ల‌లో ఉన్నాయి. వృద్ధాప్యం కార‌ణంగా వ‌చ్చే ఛాయ‌ల‌ను ఇవి తగ్గిస్తాయి. పనస
పండు తినడం వలన థైరాయిడ్ సమస్య తగ్గుతుందని వైద్యులు చెబుతున్నారు. అలాగే నాడీ శక్తి కూడా పెంపొందుతుంది.
 

 
 

Related Stories