Latest News
హోమ్ >>

ఆరోగ్యానికి కమలాపండ్లు

Updated: November 18, 2015

ఈ కాలంలో కమలాపండ్లు విరివిగా దొరుకుతాయి. సీజన్‌ ప్రకారం దొరికే పండ్లను తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. మరి కమలాపండ్లు తినండి.. క్యాన్సర్‌కు అడ్డుకట్ట వేయండి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. కమలా పండ్లలో సిట్రస్‌ పాళ్లు ఎక్కువ. వీటిని తినడం వల్ల చర్మం, ఊపిరితిత్తులు, కడుపు, పేగుల్లో క్యాన్సర్‌ రాకుండా మనల్ని కాపాడుతుంది. అలాగే కమలా పండ్లను రసం తీసి తాగడం వల్ల కిడ్నీ జబ్బులు కూడా రావు.
 
* కిడ్నీల్లో రాళ్లు చేరే అవకాశం ఉంటే కమలాపండ్లు దాన్ని నిరోధిస్తాయి. అలాగే కాలేయ క్యాన్సర్‌ను అరికడుతుంది. ఇంకా    శరీరంలో కొవ్వు పేరుకోవడాన్ని ఇది అరికడుతుంది. కొవ్వు పెరుగుదలను నిరోధించడంలో కమలాలు చాలా    శక్తివంతంగా పనిచేస్తాయి.
* కమలాపండ్లలో ఉండే ఫైబర్‌ జీర్ణశక్తిని మెరుగుపరిచి, ఆకలిని పుట్టిస్తుంది. హృదయ స్పందనలకు అవసరమైన పొటాషియం, మెగ్నీషియం కమలాపండ్లలో పుష్కలంగా    ఉంటుంది. ఈ పండ్లు రక్తపోటును అదుపులోవుంచి, పల్స్‌ రేటులో  హెచ్చు తగ్గులు రాకుండా చూస్తాయి. 
* ఇందులో ఎక్కువగా ఉండే విటమిన్‌ సి వల్ల చర్మానికి కావలసిన జీవశక్తి లభిస్తుంది. చర్మకణాలు పాడవకుండా సి విటమిన్‌ కాపాడుతుందని వైద్యులు చెబుతారు. అలాగే వైరల్‌  ఇన్‌ఫెక్షన్‌ రాకుండా కమలాలు కాపాడతాయి.శరీరంలోని మలినాలను శుద్ధిచేసి మనల్ని ఎల్లప్పుడూ ఉల్లాసంగా ఉంచే కమలాపండ్లను చక్కగా రోజూ తినడం వల్ల మనం   
  చక్కగా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
 
 
 

Related Stories