Latest News
హోమ్ >>

ప్రపంచంలో అత్యంత చెత్త నది మూసీయేనట......

Updated: March 15, 2015

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి వార్తల్లోకెక్కారు. ప్రతీ అంశంపై భిన్నంగా స్పందించే ఆయన.. ఈ సారి హైదరాబాద్ లోని మూసీ నదిపై తన వాణి వినిపించారు. ప్రపంచంలో అత్యంత చెత్త నది మూసీయేనని ట్విట్ చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్, టిఆర్ఎస్ పార్టీ దీనిపై దృష్టి పెట్టి ప్రక్షాళన చేయాలని సూచించారు. మూసీ నదిని భవిష్యత్తులో తెలంగాణకు పర్యాటక కేంద్రంగా మారాలని ఆశిస్తున్నట్టు చెప్పారు. మూసీ నది వీడియో ఫుటేజిని పోటీలకు పంపితే ఖచ్చితంగా అత్యంత మురికి నగరంగా హైదరాబాద్ గిన్నిస్ రికార్డ్ సాధించడం ఖాయమని సెటైర్ వేశారు.
 
 

Related Stories