Latest News
హోమ్ >>

రాంగోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు......

Updated: February 12, 2015

టెంపర్ మూవీలో ఎన్టీఆర్ పర్‌ఫార్మెన్స్ ముందు సీనియర్ ఎన్టీఆర్ కూడా తక్కువేనని కామెంట్ చేసి తెలుగువారి ఆగ్రహానికి గురైన రాంగోపాల్ వర్మ తాజాగా ఢిల్లీ సీఎం పీఠాన్ని సొంతం చేసుకున్న అరవింద్ కేజ్రీవాల్ గెలుపుపై కూడా వర్మ తనదైన స్టైల్లోనే స్పందించాడు. కేజ్రీవాల్ క్లీన్ స్వీప్ చేసిన విధానాన్ని తనదైన రీతిలో విశ్లేషించి మళ్లీ అందరి కంట్లో పడ్డాడు. కేజ్రీవాల్ మొట్టమొదలే మాట తప్పాడని ట్వీట్ పెట్టిన వర్మ మరో అడుగు ముందుకేసి అదే ట్వీట్ కింద ఇంకొన్ని సంచలన రాతలు రాసుకున్నాడు. తాను సీఎం అయితే ఢిల్లీలో అత్యాచారాలు ఆపుతానని చెప్పిన కేజ్రీవాల్... ఇవాళ బీజేపీ, కాంగ్రెస్‌లపై చేసిందేంటని ప్రశ్నించాడు. ఆయన ప్రశ్నలో దాగున్న గూడార్థం ఏంటో అర్థం చేసుకోవడం పెద్ద కష్టమైన పనేమీ కాదని నెటిజెన్స్ విశ్లేషించుకుంటున్నారు.  
 
 
 

Related Stories