Latest News
హోమ్ >>

చిరంజీవిపై వర్మ వివాదాస్పద వ్యాఖ్యలు

Updated: January 29, 2015

దర్శకుడు రాంగోపాల్ వర్మ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. మెగాస్టార్ చిరంజీవి తన 150వ సినిమాకు తానే దర్శకత్వం వహించుకోవాలని సూచించాడు. అలా చేయకపోతే ప్రజారాజ్యం పార్టీ స్థాపించడం కంటే కూడా పెద్ద తప్పు అవుతుందన్నాడు. ఆయనకు దర్శకుల కంటే చాలా ఎక్కువ విషయాలు తెలుసని ఆ సంగతి తాను ఆయనతో కలిసినప్పుడే తనకు అర్థమైందని అన్నాడు. త్రివిక్రమ్, వినాయక్ లాంటి వాళ్లతో చిరంజీవి 150వ సినిమా చేస్తే అది ఏదో మామూలు సినిమాయే అవుతుందని, అదే ఆయన దర్శకత్వం వహిస్తే బ్రహ్మాండమైన సినిమా అవుతుందని అన్నాడు.
 
 

Related Stories