Latest News
హోమ్ >>

జూనియర్ ఎన్టీఆర్ సినిమా రేంజ్ లో అన్న సినిమా లేదు

Updated: February 10, 2015

వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. " సీనియర్ ఎన్టీఆర్ మళ్ళీ ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ నుంచి చాలా విషయాలు నేర్చుకోవాలి " అంటూ కామెంట్స్ చేశాడు. అంతేకాదు  టెంపర్ మూవీ చూసిన వర్మ.. జూనియర్ పెర్ఫార్మెన్స్ కు  ఫ్లాట్ అయిపోయి ఈ కామెంట్స్ చేశాడని " అన్న " ఫ్యాన్స్  మండిపడుతున్నారు.  జూనియర్ ముందు పుట్టి ఉంటే ఎన్టీఆర్ కంటే పెద్ద స్టార్ అయ్యేవాడు.. సీనియర్ 40 - 50 ఏళ్ల టైంలో చేసిన మూవీ ఏదీ టెంపర్ రేంజ్ లో లేదనీ.. టెంపర్ రిలీజ్ తర్వాత ఎన్టీఆర్ వంశం జూనియర్‌‌కు ముందు జూనియర్ తర్వాత అని చెప్పుకుంటారని అన్నారు.  ఇన్ని కామెంట్స్ చేసి మరీ నేను పెద్దాయన ఫ్యాన్‌‌ని ఈ కామెంట్స్ కు ఆయన ఫ్యాన్స్ ఫీల్ కానవసరం లేదు. ఇవి కేవలం తన ఉద్వేగపూరిత భావనలేనని, టెంపర్ చూసిన ఎమోషన్‌తో  చేసిన కామెంట్స్ అని సెలవిచ్చాడట. 
 
 

Related Stories