Latest News
హోమ్ >>

మనసులోది చెప్పటం 'నా స్వభావం' ... వర్మ

Updated: September 4, 2014

వినాయకునిపై ఇటీవల ట్విట్టర్‌లో అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయడం ద్వారా మరోసారి రామ్‌గోపాల్‌ వర్మ వివాదానికి తావిచ్చిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యల కారణంగా వినాయకుని కించపరచడం ద్వారా మతపరమైన మనోభావాలను గాయపరిచారనే అభియోగం కింద ఆయనపై ఐపీసీలోని నాలుగు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భావ ప్రకటనా స్వేచ్ఛపై తనకు నమ్మకముందని చెప్పిన వర్మ తన మనసులో ఏమనుకుంటానో అది బయటకు వ్యక్తం చేయడం తన స్వభావమని అంటారు. నేను ఒప్పుకోని ఏ అంశానికైనా నేను వ్యతిరేకమే. నేను చేసేది నా అభిప్రాయాలను వ్యక్తం చేయడమే తప్ప ఎవరినీ నేను అటాక్‌ చేయను. 
‘‘నేనేమనుకుంటానో అది వ్యక్తం చేయడం నా స్వభావంలో ఓ భాగం. ఇలా చేయడం నాకిదే మొదటిసారి కాదు. ఆసక్తి ఉన్నవాళ్లు ఎవరైనా గడచిన నాలుగేళ్ల నుంచీ నేను చేస్తున్న ట్వీట్స్‌ను పరిశీలిస్తే ఈ తరహాకు చెందిన అనేక ట్వీట్స్‌ను కనుక్కోవచ్చు. అమితాబ్‌ బచ్చన్‌కు వ్యతిరేకంగా ఓ అభ్యంతరకర మాటను నేను వాడితే ఆయన మినహా మిగతావాళ్లందరూ దానిపై ఆగ్రహావేశాలు వ్యక్తంచేశారు. నిజానికి నా మాటలకు బాధపడాల్సింది ఆయనొక్కరే. కానీ నేనెందుకు ఆ మాట వాడానో ఆయనకు తెలుసు కాబట్టి ఆయన బాధపడలేదు. ప్రజాస్వామ్య దేశంలో అందరిలాగే నాకూ భావ ప్రకటనా స్వేచ్ఛ ఉంది’’ అని చెప్పారు.
 
 

Related Stories