Latest News
హోమ్ >> జనవాణి

వరకట్నం నేరమని తెలిసినా...

Updated: 2014-10-06

వరకట్నం తీసుకోవడం నేరమని అందరికీ తెలిసినా మన సమాజంలో ఆ దురాచారం నిరాఘాటంగా సాగిపోతోంది. వరకట్నం పెద్దఎత్తున ఇచ్చుకోలేని పేదవారు, మధ్యతరగతి మనుషులు అప్పు చేసి మరీ పెళ్లిళ్లు చేస్తున్నారు. చట్టాలు చేసి వాటిని అమలు చేయాల్సిన ప్రజాప్రతినిధులు ఉన్నతాధికారులు కూడా వరకట్న విధానానికి వంత పాడుతుండటం శోచనీయం. ఆడపిల్లల పాలిట వారి తల్లిదండ్రుల పాలిట శాపంగా మారిన ఈ వరకట్న భూతం రానురాను కుటుంబ సంబంధాలను వ్యాపారం స్థాయికి దిగజారుస్తోంది. వరకట్న సమస్యను నిర్మూ లించడానికి ఇప్పటి వరకు నామమాత్ర ప్రయత్నాలే జరిగాయి. అలాకాకుండా ప్రభుత్వం,స్వచ్ఛంధసంస్థలు మేధావులు అందరు కలిసి ఈ సమస్యపై ప్రజల్లో అవగాహన కలిగించడానికి పెద్దఎత్తున ప్రయత్నించాలి. తద్వారా వరకట్న దురాచారాన్ని అంతం చేయాలి. - గోదూరు అశోక్‌, కరీంనగర్‌
 
 

Related Stories