Latest News
హోమ్ >> జనవాణి

ఆరోగ్యబీమాను స్వాగతిద్దాం

Updated: 2014-09-04

ప్రభుత్వ రంగ బ్యాంకులు అతితక్కువ ప్రీమియం చెల్లింపు తో ఆరోగ్యబీమా సదుపాయం ఏర్పరచే పాలసీలను తమ ఖాతాదారులకు అందుబాటులోనికి తీసుకురావడం హర్షణీ యం. వైద్యఖర్చులు ఆకాశాన్నంటే ఈరోజుల్లో తక్కువ ప్రీమియం ఆరోగ్యబీమా పాలసీలు ప్రజలకు నిజంగా ఒక వరం. ఈ పాలసీలపై గ్రామీణ ప్రాంతాలలో కూడా విస్తృత అవగాహన కల్పించాల్సిన ఆవశ్యకత ఉంది. ఆరోగ్యశ్రీ పరి ధిలోనికిరాని కుటుంబాలు ఈ పాలసీల వలన నిస్సందే హంగా చక్కని ప్రయోజనం పొందుతారు. బ్యాంకులు లేని గ్రామాలలో కూడా ఈ పాలసీలను ప్రజలకు అంద జేసేందుకు ప్రత్యేకచర్యలు చేపట్టాలి. - ఎం.కనకదుర్గ, తెనాలి
 
 

Related Stories