Latest News
హోమ్ >> Posts

ఫ్రిజ్ లో ఉంచిన గుడ్లు తింటే అనారోగ్యమే..!

Updated: June 12, 2016

మనందరం కోడిగుడ్లను చాలా రోజుల పాటు ఫ్రిజ్‌లో ఉంచుతాము అవునా! ఎందుకు అని ఎపుడైనా ఆలోచించారా? మనం వాడే ఫ్రిజ్‌లలో కూడా గుడ్లను ఉంచటానికి ప్రత్యేక స్థానం
కూడా ఉంటుంది. కానీ, గుడ్లను అందులో ఉంచటానికి రెండు, మూడుసార్లు ఆలోచించాలి. ఎందుకంటే, ఫ్రిజ్‌ లో నిల్వ చేసిన గుడ్లను తినటం వలన అనారోగ్యాలకు గురవుతామని
వైద్యులు చెబుతున్నారు. ఎందుకు ఉంచకూడదనే కారణాలు తెలిస్తే ఆశ్చర్యానికి గురవుతారు.
కుళ్లిపోవటం: గది ఉష్ణోగ్రతలో ఉంచిన గుడ్లతో పోలిస్తే, ఫ్రిజ్‌ లో ఉంచిన గుడ్లు త్వరగా కుళ్లిపోతాయి. ఫ్రిజ్‌ లో ఉంచిన గుడ్లను బయటకు తీసిన తరువాత పుల్లటి రుచి అనిపిస్తుంది కావునా గది ఉష్ణోగ్రత వద్ద నిల్వ ఉంచటమే మంచిది.
పెంకుపై బ్యాక్టీరియా: గది ఉష్ణోగ్రతలో ఉంచిన గుడ్లు మరియు ఫ్రిజ్‌లో నిల్వ ఉంచిన గుడ్లను గమనిస్తే, ఫ్రిజ్‌లో ఉంచిన గుడ్లు, ఘనీభవనానికి గురై, పెంకుపై బ్యాక్టీరియా అభివృద్ధి చెందేఅవకాశం ఉంది. వీటిని తినటం వలన అనారోగ్యానికి గురయ్యే అవకాశం చాలానే ఉంది. గుడ్లు క్యుటికల్స్‌లను కలిగి ఉంటాయి తాజా గుడ్లను ఫ్రిజ్‌ లో ఉంచాల్సిన అవసరం లేదుఎందుకంటే, వీటిలో ఉండే క్యుటికల్స్‌లు చెక్కుచెదరకుండా ఉంటుంది.

సాల్మొనెల్లా సంక్రమణ: గది ఉష్ణోగ్రత వద్ద సాల్మొనెల్లా సోకిన గుడ్డు పక్కనున్న గుడ్డు కూడా వైరస్‌కు గురవుతుంది. కానీ, ఫ్రిజ్‌ లో ఉంచటం వలన ఇలాంటి సంక్రమణకు గురవకుండాచూసుకోవచ్చు. నిజానికి తాజా గుడ్లను రెండురోజుల లోపే తినటం చాలా ఆరోగ్యకరం.
 
 
 

Related Stories