Latest News
హోమ్ >> Posts

తెల్లవెంట్రుకలని నివారించటం ఇలా!

Updated: December 26, 2015

ఆధునిక కాలంలో చిన్నప్పటి నుంచే తెల్ల వెంట్రుకలు బాధిస్తున్నాయి. వాటిని నిరోధించుకోవడానికి అనేక రసాయనిక రంగులను వాడుతున్నారు. ఇవి చర్మానికి హాని చేస్తాయి. అందుకే ప్రకృతి ప్రసాదించిన సహజమైన ఉత్పత్తులతో తెల్ల వెంట్రుకలను నివారించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. * తెల్లవెంట్రుకలను నివారించేందుకుగాను రాత్రిపూట ఇనుప చేసిన బాండీలో ఉసిరికాయ, కుంకుడుకాయ, శీకాకాయల మిశ్రమాన్ని నీటిలో నానబెట్టాలి. దీనికి ఉదయాన్నే గోరింటాకు కలిపి మరల రెండు-మూడు గంటలు నానబెట్టాలి. ఆ తర్వాత వెంట్రుకలకు అప్లై చేసుకొని అరగంట తర్వాత నీటితో కడిగేయాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే వెంట్రుకలు నల్లగా మారి, ఒత్తుగానూ పెరుగుతాయని నిపుణులు సూచిస్తున్నారు. * ఆహారంలో కరివేపాకును ఎక్కువగా తీసుకోవాలి. దీని వల్ల వెంట్రుకల రంగు మారుతుంది.
 
 

Related Stories