Latest News
హోమ్ >> Posts

ఉసిరి సర్వరోగ నివారిణి

Updated: November 30, 2015

ఉసిరి చేతిలో ఉంటే చాలు సర్వరోగాలూ పోతాయని పెద్దలు చెబుతారు. చలికాలం లో ప్రకృతి ప్రసాదించిన అపురూప వరం ఉసిరికాయ. ఉసిరి కాయంటే తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు. అంతే కాదు ఇందులో ఉండే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుంటే ఆశ్చర్యం కలగక మానదు. స్వచ్ఛంగా కనిపిస్తూ చూడగానే తినాలనిపించే అత్యుత్తమమైన మూలిక. అందుకే దీనిని మూలికల రాజు అంటారు. ఉసిరి ద్వారా ఆరోగ్యవంతమైన శరీరాన్ని మన సొంతం చేసుకోవచ్చు. ఉసిరికాయను ఇంగ్లీష్ లో (gooseberry) అంటారు. దీని పేరులాగే ఇవి తినడానికి కూడా పుల్లగా, వగరుగా ఉంటాయి. ఆకుపచ్చగా ఉండే వీటిలో ఔషధ గుణాలు కూడా మెండుగా ఉంటాయి. ఈ ఉసిరికాయలో విటమిన్ సి, మరియు విటమిన్ ఐ పుష్కలంగా ఉంటుంది. ఉసిరి కాయలను, గింజలను, ఆకులను, పూలను, వేళ్ళను, బెరడును ఆయుర్వేద ఔషధాలలో వాడతారు.   * ఉసిరిని తీసుకోవడం వల్ల శరీర బరువును తగ్గించుకోవడంతో పాటు అదనపు కొవ్వును కరిగించుకోవచ్చు. * ఉసిరికాయను హెయిర్ ఆయిల్ లో కలిపి రాసుకుంటే జుట్టు గట్టిగ ఉంటుంది. * ఉసిరికాయ తినటం వల్ల గొంతు సమస్యలు తగ్గించుకోవచ్చు, కోరింత దగ్గును తగ్గిస్తుంది. * ఉసిరిని తీసుకోవడం వల్ల వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. * గ్యాస్ సమస్యతో బాధపడుతున్న వారు ఒక గ్రామ్ ఉసిరి పౌడర్ తీసుకొని దీనికి కొంచెం పంచదార కలుపుకొని ఒక గ్లాస్  నీటిలో కలుపుకొని రోజుకు రొండు సార్లు తాగాలి. * ఉసిరి వల్ల ఏకాగ్రత పెరుగుతుంది. ఉసిరి వల్ల స్పెర్మ్ కౌంట్ కూడా పెరుగుతుంది. * ఉసిరి రోజు తినటం వల్ల ఉపిరితిత్తులకు బాగా బలం వస్తుంది. ఉసిరి లో క్రోమియం అధికంగా ఉంటుంది దీని వలన మధుమేహాన్ని అదుపులో ఉంచొచ్చు. * ఉసిరి కాయ తినటం వల్ల అస్తమ రోగులకు మంచి ఉపయోగకారిగా ఉంటుంది. * ఉసిరి యూరినరి ప్రొబ్లెమ్స్ తగ్గించటంలో బాగా సహకరిస్తుంది. ఉసిరి కాయల గింజల పౌడర్ని నీమ్మరసంతో కలిపి రాసుకుంటే ఒక గంటలో పేలు చచ్చిపోతాయి.
 
 

Related Stories