Latest News

బాబు శవాలను పీక్కుతినే అఘోరుడు-కోటంరెడ్డి

Updated: 2016-06-14

గంగానదిలో మనుషుల శవాలను పీక్కుతినే అఘోరాల మాదిరి గా వ్యవహరిస్తున్న చంద్రబాబును రాజకీయ అఘోరుడు అని అంటే తప్పు ఏమిటని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి
శ్రీధర్ రెడ్డి అన్నారు. చంద్రబాబుకు చిత్తశుద్ది ఉంటే ఎమ్మెల్యేల ఫిరాయింపులపై సిబిఐ విచారణకు సిద్దపడాలని, ఒక పార్టీ లో గెలిచి మరో పార్టీలోకి వెళ్లే వారిని రాజకీయ వ్యభిచారులు,
రాజకీయ దొంగలు, మోసగాళ్లు, రాజకీయ దివాళాకోరులు, కన్నతల్లిని అమ్ముకునే వ్యక్తులని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గాథలో చెప్పారని శ్రీధర్ రెడ్డి అన్నారు. ఎన్నికల ముందు ఇలా మాట్లాడిన చంద్రబాబు నాయుడు ఆయన చెప్పిన రాజకీయ వ్యభిచారులకు బలవంతంగా కండువా కప్పుతున్నారని, మరి ఇప్పుడు చంద్రబాబును ఏమనాలని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు కొందరు ఎమ్మెల్యేలను మార్చుకున్నంతమాత్రాన ఫలితం మారదని, అది చరిత్ర అని శ్రీధర్ రెడ్డి అన్నారు. ఎన్నికల ముందు కొందరు టిడిపి నేతలు జగన్ వద్దకు వెళ్లి కాళ్లకు నమస్కారం చేసి టిక్కెట్లు అడిగారని, ఆయన ఇవ్వకపోతే టిడిపిలో చేరారని వారిలో కొందరు మంత్రులు అయ్యారని అన్నారు. తమ నేత జగన్ కు అబద్దలు చెప్పడం చాతకాక, పవన్ కళ్యాణ్, మోడీ, రుణమాఫీ పుణ్యమా అని చంద్రబాబు గెలిచారని, కాని ఇప్పుడు రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తే 2019 లో వాచీ ఎన్నికల సునామీలో కొట్టుకుపోతారని, అది జగన్ సునామీఅని శ్రీధర్ రెడ్డి అన్నారు. మరో పది మంది ఎమ్మెల్యేలను కొన్నా తమకు ఏమి అవ్వదని శ్రీధర్ రెడ్డి చెప్పారు.
 

 
 
 
 
More News
➻ చంద్రబాబు నీచుడు - లక్మీపార్వతి

➻ ఎమ్మెల్యేలను కాదు.. పశువులను కొంటున్నారు

➻ చంద్రబాబు చవట సన్నాసి - కొడాలి

➻ తెలంగాణలో కమ్మ వర్గం కొంపముంచిందా?

➻ బాబు వల్ల ట్రాఫిక్ సమస్య తప్ప ఉపయోగంలేదు

➻ ప్రకాశం టిడిపి నేతల కుమ్ములాట

➻ తెలంగాణలో భ్రష్టుపట్టిన రాజకీయాలు - జానా

➻ ఈ నెల 28 నుంచి ఫ్రీడం 251 స్మార్ట్‌ఫోన్ల డెలివరీ

➻ ఈ క్రెడిట్ చంద్రబాబుకే ఇవ్వాలి

➻ ఏమైనా జరిగితే తీవ్ర పరిణామాలు - చిరంజీవి

➻ కాపులు ఉగ్రవాదులు కారు - దాసరి

➻ జగన్, ముద్రగడ ఎగిరిపోయే గాలిపటాలు

➻ కోపం పురందేశ్వరి పైనా..? కమలంపైనా..?

➻ కేసులు ఎత్తివేయలేం - చినరాజప్ప

➻ పోలీస్ పిచ్చి డాక్టర్ ను జైలుపాలు చేసింది

➻ మనిషి గుండె లేకుండా 555 రోజులు

➻ మిమ్మల్నేమీ ఉపరాష్ట్రపతిని చేయరు - కేజ్రీవాల్

➻ ముద్రగడకి హాని జరిగితే చంద్రబాబుదే బాధ్యత

➻ మోసం మాటలుతో అధికారంలోకి రావచ్చు-పెద్దిరెడ్డి

➻ లోకేష్, బాబు చెప్పారని సాక్షిని ఆపుతారా-అంబటి

 
 

Related Stories