వైఎస్ ఆర్ అధ్యక్షుడు జగన్, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంలు ఎగిరిపోయే గాలిపటాలని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిది, పౌర సరషరాల సంస్థ చైర్మన్ మల్లెల లింగారెడ్డి
అన్నారు. ఈ గాలి పటాలు ఎక్కడ తెగిపోతాయో తెలియదని ఆయన విమర్శించారు. వారిద్దరికి ఒక లక్ష్యం, గమ్యం లేదని, ప్రజల అవసరాలకు వీరు పనికి రారని లింగారెడ్డి పేర్కొన్నారు.
పనిలేని వీరిద్దరూ ఏకమై ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని మల్లెల అన్నారు. ముద్రగడ పద్మనాభానికి తెలుగుదేశం రాజకీయ బిక్ష పెట్టి, మంత్రి పదవి ఇచ్చి గౌరవించిందని, అటువంటి
తెలుగుదేశం పార్టీని ముద్రగడ ఇబ్బందిపెట్టడం అంటే తల్లిపాలు తాగి ద్రోహం చేయడమేనని లింగారెడ్డి ఆరోపించారు.
|