తన కారుపై కాకి వాలిందని ఆయన కొత్త కారు కొన్నాడన్న వార్త కర్నాటకలో సంచలనంగా ఉంది. కొద్ది కాలం క్రితం సిద్దరామయ్య కారుపై ఒక కాకి వాలిందట.దానిని డ్రైవర్ కొట్టి
పంపడానికి ప్రయత్నించినా దాదాపు పది నిమిషాలు అక్కడే ఉందట. దానిని వీడియో తీసినవారు చానళ్లలో ప్రసారం చేశారు.కర్నాటకలో కాకిని అపశకునంగా బావిస్తారట.దాంతో
సిద్దరామయ్య కొత్త కారును ముప్పై ఐదు లక్షల వ్యయం చేసి కొనుగోలు చేశారట.సిద్దరామయ్య ఏ కారణంతో కొన్నా ఇప్పుడు కాకి వాలడం వల్లే కొన్నారన్న అబిప్రాయం ఏర్పడిందట.
కర్నాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు కూడా ఇలాంటి నమ్మకాలు ఉన్నాయా? అని ప్రజల్లో చర్చనీయామ్సమైంది.
|