Latest News

విశాఖలో ఐపీఎల్ - 9 మ్యాచ్ లు

Updated: April 20, 2016

విశాఖ : ఇండియన్ ప్రీమియర్ లీగ్ తొమ్మిదో సీజన్ సరికొత్త ఫ్రాంచైజీ.. రెయిజింగ్ పూణే సూపర్ జెయింట్స్ రెండో హోంగ్రౌండ్ గా...స్టీల్ సిటీ విశాఖపట్నంలోని ఏసీఏ-వీడీసీఏ క్రికెట్
స్టేడియం ఖాయమయ్యింది. మహేంద్రసింగ్ ధోనీ నాయకత్వంలోని పూణేజట్టు ఆడే మూడుమ్యాచ్ లకు విశాఖ స్టేడియం ఆతిథ్యమిస్తుంది....
మహారాష్ట్రలోని తీవ్రకరువు, దుర్భిక్ష పరిస్థితులు...ఆంధ్రా క్రికెట్ సంఘం పాలిట వరంగా మారాయి. మహారాష్ట్రలోని పూణే, ముంబై, నాగపూర్ నగరాలలో ఏప్రిల్ 30 తర్వాత జరగాల్సిన ఐపీఎల్ మ్యాచ్ లపై బాంబే హైకోర్టు నిషేధం విధించడంతో...పూణే ఫ్రాంచైజీ మ్యాచ్ ల్లో మూడింటిని...విశాఖపట్నంలోని ఏసీఏ-వీడీసీఏ స్టేడియం వేదికగా నిర్వహించడానికి రంగం సిద్ధమయ్యింది.
ఐపీఎల్ తొమ్మిదోసీజన్లో తొలిసారిగా పాల్గొంటున్న పూణే ఫ్రాంచైజీ రెండో హోంగ్రౌండ్ గా...విశాఖను ఎంపిక చేసుకొంది. మహేంద్రసింగ్ ధోనీ నాయకత్వంలోని .. రెయిజింగ్ పూణే
సూపర్ జెయింట్స్ జట్టు.. మే నెలలో ఆడాల్సిన మూడు మ్యాచ్ లకు విశాఖపట్నంలోని  ఏసీఏ-వీడీసీఏ స్టేడియం ఆతిథ్యమివ్వనుంది.
ఈమ్యాచ్ ల కోసం తొలిసారిగా స్పైడర్ కెమెరాను సైతం విశాఖ స్టేడియంలో ఉపయోగించబోతున్నారు. మే 10న పూణే సూపర్ జెయింట్స్ తో జరిగే పోటీలో హైదరాబాద్ సన్ రైజర్స్
జట్టు ఢీ కొంటుంది. మే 17న పూణేజట్టుతో జరిగే పోటీలో ఢిల్లీ డేర్ డెవిల్స్ ఢీ కొంటుంది. ఈ రెండుమ్యాచ్ లూ ..రాత్రి 8 గంటలకు ఫ్లడ్ లైట్ల వెలుగులో నిర్వహిస్తారు. విశాఖ వేదికగా
పూణే జెయింట్స్ ఆఖరిమ్యాచ్ మే 21న కింగ్స్ పంజాబ్ జట్టుతో జరుగుతుంది. ఈమ్యాచ్  సాయంత్రం 4 గంటలకు ప్రారంభమవుతుంది.
ఈ మూడుమ్యాచ్ లకూ ఆతిథ్యమివ్వడం ద్వారా..ఆంధ్ర క్రికెట్ సంఘానికి కోటీ 80 లక్షల రూపాయల ఆదాయం సమకూరనుంది. ఒక్కో మ్యాచ్ కూ...ఫ్రాంచైజీ 30 లక్షల రూపాయలు, బీసీసీఐ 30 లక్షల రూపాయల చొప్పున ఆంధ్ర క్రికెట్ సంఘానికి చెల్లించనున్నాయి. మహారాష్ట్ర క్రికెట్ సంఘానికి జరిగిన నష్టం..ఆంధ్రా క్రికెట్ సంఘానికి జరిగిన లాభంగా మారడం నిజంగా..చిత్రమే మరి.

 
 
 
 
More News
➻ చంద్రబాబు నీచుడు - లక్మీపార్వతి

➻ ఎమ్మెల్యేలను కాదు.. పశువులను కొంటున్నారు

➻ చంద్రబాబు చవట సన్నాసి - కొడాలి

➻  బాబు శవాలను పీక్కుతినే అఘోరుడు-కోటంరెడ్డి

➻ తెలంగాణలో కమ్మ వర్గం కొంపముంచిందా?

➻ బాబు వల్ల ట్రాఫిక్ సమస్య తప్ప ఉపయోగంలేదు

➻ ప్రకాశం టిడిపి నేతల కుమ్ములాట

➻ తెలంగాణలో భ్రష్టుపట్టిన రాజకీయాలు - జానా

➻ ఈ నెల 28 నుంచి ఫ్రీడం 251 స్మార్ట్‌ఫోన్ల డెలివరీ

➻ ఈ క్రెడిట్ చంద్రబాబుకే ఇవ్వాలి

➻ ఏమైనా జరిగితే తీవ్ర పరిణామాలు - చిరంజీవి

➻ కాపులు ఉగ్రవాదులు కారు - దాసరి

➻ జగన్, ముద్రగడ ఎగిరిపోయే గాలిపటాలు

➻ కోపం పురందేశ్వరి పైనా..? కమలంపైనా..?

➻ కేసులు ఎత్తివేయలేం - చినరాజప్ప

➻ పోలీస్ పిచ్చి డాక్టర్ ను జైలుపాలు చేసింది

➻ మనిషి గుండె లేకుండా 555 రోజులు

➻ మిమ్మల్నేమీ ఉపరాష్ట్రపతిని చేయరు - కేజ్రీవాల్

➻ ముద్రగడకి హాని జరిగితే చంద్రబాబుదే బాధ్యత

➻ మోసం మాటలుతో అధికారంలోకి రావచ్చు-పెద్దిరెడ్డి

 
 

Related Stories