Latest News

జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ తో ఆ ప్రమాదం? జాగ్రత్త

Updated: 2016-03-08

జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌...! ఈ పేరు వినగానే పసిపిల్లల చర్మానికి హాని కలగని సబ్బులు, పౌడర్లే గుర్తొస్తాయి. కానీ ఇప్పుడా బ్రాండ్‌ ఉత్పత్తుల విశ్వసనీయతే ప్రశ్నార్థకమైంది. అమెరికాకు చెందిన ఓ మహిళ.. ఈ సంస్థ ఉత్పత్తులు వాడడం వల్ల యోని సంబంధ క్యాన్సర్‌కు గురై మరణించింది. కేసును విచారించిన న్యాయస్థానం జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌కు 468 కోట్ల రూపాయల భారీ జరిమానాను విధించింది. పురిటి బిడ్డలు మొదలు దాదాపు ఐదేళ్ల వరకూ పిల్లలకు జాన్సన్ అండ్‌ జాన్సన్‌ వారి సబ్బులు, పౌడర్లు వాడుతుంటారు. ఆ సంస్థ కూడా తమ ఉత్పత్తులు సురక్షితమైనవంటూ ప్రచారాన్ని ఊదరగొట్టేస్తోంది. దీన్ని నమ్మి ప్రజలు వేలం వెర్రిగా సదరు సంస్థ ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నారు. అయితే ఈ సంస్థ ఉత్పత్తుల విశ్వసనీయతపై ఇప్పుడు కొత్త అనుమానాలు కలుగుతున్నాయి.
అమెరికాలోని బర్మింగ్‌హామ్‌ చెందిన ఫాక్స్‌ అనే మహిళ 35 ఏళ్లుగా జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ టాల్కం పౌడర్‌నే వాడేవారు. దీని కారణంగా ఆమె యోని సంబంధ క్యాన్సర్‌కు గురై మూడేళ్ల క్రితం మరణించారు. టాల్కం పౌడర్‌లో ఉపయోగించే మినరల్‌ కెమికల్స్‌... ఫాక్స్‌ శరీరంపై దుష్ఫలితాలు చూపడంతోనే ఆమె మృతి చెందిందని వైద్య పరీక్షల్లో తేలింది. వైద్యుల ధ్రువీకరణ అనంతరం.. ఫాక్స్‌ బంధువులు.. జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ సంస్థపై కోర్టులో కేసు వేశారు. కేసు విచారించిన మిస్సోరి జ్యూరీ బాధిత మహిళ కుటుంబానికి 72 మిలియన్ల డాలర్లు అంటే భారతీయ కరెన్సీలో సుమారు 468 కోట్ల రూపాయలను నష్ట పరిహారంగా చెల్లించాలని ఆదేశించింది. టాల్కం పౌడర్‌ వల్ల సంభవించే దుష్ఫలితాపై వినియోగదారులను చైతన్య 
పరచాల్సిన బాధ్యత సదరు కంపెనీదే అంటూ కోర్టు తీర్పు నిచ్చింది.
కోర్టు దెబ్బకు దిమ్మతిరిగిన జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ సంస్థ పెనాల్టీ మొత్తాన్ని తగ్గించాలంటూ అప్పీలు చేసింది. ఈ కేసు నేపథ్యంలోనే అటు న్యూజెర్సీలోనూ జాన్సన్‌ సంస్థ పౌడర్‌లపై మరిన్ని కేసులు నమోదయ్యాయి. పౌడర్‌ దుష్పరిణామాల గురించి అమెరికా వ్యాప్తంగా ఇప్పుడు 1200కు పైగా కేసులు నడుస్తున్నాయి. మన దేశంలోనూ జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ సంస్థ పౌడర్లు, సబ్బులను ఇబ్బడిముబ్బడిగా వాడుతున్నారు. అమెరికన్‌ కేసు తర్వాత భారత్‌లోనూ ఈ ఉత్పత్తులపై సందేహాలు మొదలయ్యాయి. మరి ఇక్కడి ఉత్పత్తుల గురించి సంస్థ ప్రతినిధుల స్పందన ఏంటో ఇంకా వెల్లడి కావాల్సి ఉంది.  ఏది ఏమైనా జాగ్రత్తగా వుండటం మంచిది.
 
 
 
 
More News
➻ చంద్రబాబు నీచుడు - లక్మీపార్వతి

➻ ఎమ్మెల్యేలను కాదు.. పశువులను కొంటున్నారు

➻ చంద్రబాబు చవట సన్నాసి - కొడాలి

➻  బాబు శవాలను పీక్కుతినే అఘోరుడు-కోటంరెడ్డి

➻ తెలంగాణలో కమ్మ వర్గం కొంపముంచిందా?

➻ బాబు వల్ల ట్రాఫిక్ సమస్య తప్ప ఉపయోగంలేదు

➻ ప్రకాశం టిడిపి నేతల కుమ్ములాట

➻ తెలంగాణలో భ్రష్టుపట్టిన రాజకీయాలు - జానా

➻ ఈ నెల 28 నుంచి ఫ్రీడం 251 స్మార్ట్‌ఫోన్ల డెలివరీ

➻ ఈ క్రెడిట్ చంద్రబాబుకే ఇవ్వాలి

➻ ఏమైనా జరిగితే తీవ్ర పరిణామాలు - చిరంజీవి

➻ కాపులు ఉగ్రవాదులు కారు - దాసరి

➻ జగన్, ముద్రగడ ఎగిరిపోయే గాలిపటాలు

➻ కోపం పురందేశ్వరి పైనా..? కమలంపైనా..?

➻ కేసులు ఎత్తివేయలేం - చినరాజప్ప

➻ పోలీస్ పిచ్చి డాక్టర్ ను జైలుపాలు చేసింది

➻ మనిషి గుండె లేకుండా 555 రోజులు

➻ మిమ్మల్నేమీ ఉపరాష్ట్రపతిని చేయరు - కేజ్రీవాల్

➻ ముద్రగడకి హాని జరిగితే చంద్రబాబుదే బాధ్యత

➻ మోసం మాటలుతో అధికారంలోకి రావచ్చు-పెద్దిరెడ్డి

 
 

Related Stories