ప్రభుత్వాలు తమాషాగా నిర్ణయాలు తీసుకుంటాయి. రాజదాని ప్రాంతంలో భూములు విలువలు పెరిగి అంతా కోటీశ్వరులు అయిపోయారని, అమరావతి రాజధానిలో అన్న క్యాంటీన్లుమూడు చోట్ల ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు మంత్రులు పరిటాల సునీత, నారాయణ,పుల్లారావులు తెలిపారు. నిజానికి టిడిపి హామీ ప్రకారం రాష్ట్రం అంతటా వీటిని ఏర్పాటుచేయాల్సి ఉండగా, ప్రస్తుతం రాజదానిలోని తుళ్లూరు, వెలగపూడి, నవులూరులో మూడు చోట్ల ఏర్పాటు చేస్తామని మంత్రులు అన్నారు. రూపాయికే ఇడ్లీ, ఐదు రూపాయలకు పులిహోరా,మూడు రూపాయలకు పెరుగన్నం ఏర్పాటు చేస్తామన్నారు. రోజుకు ఐదువందల మందికి ఇవి సమకూర్చుతామన్నారు. రాజదాని ప్రాంతంలో భూములు విలువలు పెరిగి అంతాకోటీశ్వరులు అయ్యారని ప్రభుత్వ నేతలు చెబుతూ వచ్చారు. కరువు ప్రాంతాలైన అనంతపురం లేదా విజయనగరం వంటి నిరుపేద జిల్లాలలో ప్రజలకు ఉపయోగం ఉండేలా వీటిని ఏర్పాటుచేస్తే ఎక్కువ ఉపయోగం ఉండేదేమో అని,రాజదానిలో ఎందుకు నెలకొల్పుతున్నారో అర్ధం కావటంలేదని ప్రజలు విమర్శిస్తున్నారు.
|