కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం దీక్ష ను కొనసాగిస్తుండడంతో ప్రభుత్వంలో టెన్షన్ పెరుగుతోంది. ఒకవైపు కాపు టిడిపి నేతల ఒత్తిడి, మరో వైపు చట్టపరమైన
ఇబ్బందులతో ప్రభుత్వం సతమతమవుతన్నట్లుగా ఉంది. ముద్రగడతో జరిగిన చర్చలు ఒక కొలిక్కి రాలేదు. జైలులో ఉన్న కాపు రిమాండ్ ఖైదీలను కూడా చర్చలలోకి తీసుకు వచ్చారు.అయినా ఫలితం దక్కలేదు. చర్చలకు తీసుకు వచ్చిన వారిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తీసుకు వెళ్లామని అదికారులు చెబుతున్నారు. తుని రైలు విద్వంసం కేసులో అరెస్టు అయినవారిని విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఇంకా అరెస్టు లు ఉండరాదని ఆయన స్పష్టం చేస్తున్నారు. దీనిపై ఒక దశలో ఈ సమస్య ఒక కొలిక్కి వస్తుందని జగ్గంపేటఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. కాని అది జరగలేదు. ప్రతిష్టంభన ఏర్పడింది. కాగా ముద్రగడ కు బలవంతంగా వైద్యం చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుందని వైద్యులు అంటున్నారు.
|