Latest News
హోమ్ >>Latest News

తెలంగాణలో భ్రష్టుపట్టిన రాజకీయాలు - జానా

Updated :  --June 14, 2016

తెలంగాణలో పార్టీ ఫిరాయింపులు జుగుప్సాకరమని, పార్టీ మారిన వారికి ప్రజలు సరైన సమయంలో బుద్ధి చెప్పాలన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో టీఆర్‌ఎస్‌ వైఖరి ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఉందని మండిపడ్డారు. మేధావులు, ఉద్యోగులు, విద్యార్థులు కోరుకున్న తెలంగాణ ఇదేనా? అని జానా ప్రశ్నించారు. పార్టీ మారినవారిపై అనర్హత వేటు వేయాలని కోర్టుకు వెళ్తామని ఆయన తెలిపారు. ఫిరాయింపులకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్రం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బంగారు తెలంగాణ అంటూ భ్రష్టుపట్టిన రాజకీయాలు చేస్తున్నారని జానారెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తనకు ఏ పదవిపై ఆశలేదని  సీఎల్పీ సహా అన్ని పదవులు వదులుకుంటానని  జానారెడ్డి స్పష్టం చేశారు. సోనియాకు చెప్పిన తర్వాత నిర్ణయం తీసుకుంటానని ఆయన తెలిపారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సోనియా తెలంగాణ ఇచ్చారన్నారు. అవసరం వచ్చినప్పుడల్లా ప్రభుత్వానికి సహకరిస్తున్నామని అయినా కాంగ్రెస్‌ పట్ల టీఆర్‌ఎస్‌కు కృతజ్ఞతలేదని జానా వ్యాఖ్యానించారు.

 
 
 
More News
➻ ఫలించని చర్చలు - ప్రభుత్వంలో టెన్షన్

➻ కోటీశ్వరుల ప్రాంతాలలో అన్న క్యాంటిన్లు ?

➻ అమరావతి పోలీసులకు అధునాతన డ్రోన్ లు

➻ బాబు వల్ల ట్రాఫిక్ సమస్య తప్ప ఉపయోగంలేదు

➻ ప్రకాశం టిడిపి నేతల కుమ్ములాట

➻ తెలంగాణలో భ్రష్టుపట్టిన రాజకీయాలు - జానా

➻ ఈ నెల 28 నుంచి ఫ్రీడం 251 స్మార్ట్‌ఫోన్ల డెలివరీ

➻ జగన్ తో 'చంద్రబాబు'కు సన్మానం చేయిస్తా - పిల్లి

➻ చత్తీస్ గడ్ లో భారీ ఎన్ కౌంటర్

➻ క్షీణదశలో ముద్రగడ ఆరోగ్యం

➻  కోపం పురందేశ్వరిపైనా? లేక కమలంపైనా?

➻ కేసులు ఎత్తివేయలేం-చినరాజప్ప

➻ కాపులు ఉగ్రవాదులు కారు-దాసరి

➻ మిమ్మల్ని ఉపరాష్ట్రపతిని చేయరు-కేజ్రీవాల్

➻  ఏమైనా జరిగితే తీవ్ర పరిణామాలు-చిరంజీవి

➻ జగన్, ముద్రగడ ఎగిరిపోయే గాలిపటాలు

➻ ముద్రగడకి హాని జరిగితే చంద్రబాబుదే బాధ్యత

➻ మోసం మాటలుతో అధికారంలోకి రావచ్చు-పెద్దిరెడ్డి

➻ లోకేష్, బాబు చెప్పారని సాక్షిని ఆపుతారా-అంబటి

➻  1.10 లక్షల కోట్లు తెలంగాణకు ఇచ్చాం-చింతల

 
 

Related Stories