కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఆరోగ్యాన్ని కాపాడవలసిన బాద్యత తమ ప్రభుత్వంపై ఉందని, ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప,మున్సిపల్ మంత్రి నారాయణలు అన్నారు. ఆరోగ్య కారణాల రీత్యా ముద్రగడ తన దీక్షను విరమించుకోవాలని వారు కోరారు. ముద్రగడ ప్రాణాలు తమకు ముఖ్యమని, ఆయన వైద్యానికి సహకరించాలని వారు విజ్ఞప్తి
చేశారు. చిరంజీవి, దాసరి నారాయణరావు, బొత్స సత్యనారాయణ వంటి నేతలు ఎప్పుడైనా కాపుల గురించి మాట్లాడారా అని వారు ప్రశ్నించారు. కాపుల ముసుగులో వైఎస్ ఆర్ కాంగ్రెస్ప్రజలను రెచ్చగొట్టే యత్నం చేస్తోందని వారు ఆరోపించారు. అయితే కోర్టు కేసులను ఎత్తివేయడం కుదరదని చినరాజప్ప, నారాయణ తెలిపారు.
|