తెలంగాణకు తొంభైవేల కోట్లు కాదని, అంతకన్నా ఎక్కువే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందని బిజెపి ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి చెప్పారు. ఆర్దిక మంత్రి ఈటెల రాజేందర్ బిజెపి అధ్యక్షుడుఅమిత్ షా అన్ని అసత్యాలే చెప్పారని అనడంపై చింతల ఆగ్రహం వ్యక్తం చేశారు. సూర్యాపేట బహిరంగ సభను చూసి టిఆర్ఎస్ ఓర్చుకోలేకపోతోందని ఆయన అన్నారు. తెలంగాణకునిజానికి లక్షా పదహారువేల కోట్ల రూపాయల సాయాన్ని కేంద్రం అందించిందని ఆయన తెలిపారు. దీనిపై తెలంగాణ అసెంబ్లీలోకాని, పామ్ హౌస్ లో కాని బహిరంగ చర్చకు సిద్దమనిరామచంద్రారెడ్డి సవాల్ చేశారు. కరువు నివారణకు 791 కోట్లు మంజూరు చేస్తే ఒక్క రూపాయి అయినా రైతుకు ఇచ్చారా అని చింతల ప్రశ్నించారు.
|